ట్విట్టర్ ద్వారా విశాఖ ఘటనపై స్పందించిన భారత క్రికెట్ జట్టు కెప్టెన్ కోహ్లీ


క్రీడలు :ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో గ్యాస్ భారీ ఎత్తున లీక్ కావడంతో దాని ప్రభావం ఐదు గ్రామాలపై పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటికే 10 మంది మృతి చెందారు. అయితే విషవాయువు కారణంగా వేల మంది అస్వస్థతకు గురయ్యారు. అయితే ఇందులో కొంత మంది పరిస్థితి విషమంగా ఉంది. ఇక ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రులు, ప్రధాని, రాష్ట్రపతి, టాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ విషాదం పై తమ సిసిల మీడియా ద్వారా సపందించారు. అయితే ఈ విషయం పై భారత సారథి విరాట్ కోహ్లీ కూడా తన ట్విట్టర్ ద్వారా స్పందించాడు. కోహ్లీ... "వైజాగ్ గ్యాస్‌ లీక్ లో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు నా సంతాపం. ఆసుపత్రిలో ఉన్న ప్రతి ఒకరు కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాను" అని తెలిపాడు.