వలసదారులకు సామూహిక కరోనా నిర్ధా రణ పరీక్షలు తప్పనిసరి చేయాలి అనే ఆలోచనలో కేంద్రం


జాతీయం :  వలసదారులకు సామూహిక కరోనా నిర్ధా రణ పరీక్షలు (పూల్డ్‌ శాంపిలింగ్‌) చేయాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ గురువారం రాష్ట్రా లను ఆదేశిస్తూ, మార్గదర్శకాలు జారీచేసింది. ప్రస్తుతం వివిధ రాష్ట్రాలు, విదేశాల నుంచి వేలాది మంది ఇక్కడకు వస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో కొందరు వైరస్‌ అనుమానిత లక్ష ణాలతో ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉన్నారు. అలాగే, విదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పర్య వేక్షణలో తమ సొంత ఖర్చులతో హోటళ్లు, లాడ్జిల్లో క్వారంటైన్‌లో ఉన్నారు. 
వీరందరికీ సామూహిక కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని కేంద్రం పేర్కొంది. వాస్తవంగా విదే శాల నుంచి వచ్చే వారు, సంబం ధిత దేశంలో ప్రయాణానికి ముందే కరోనా నిర్ధా రణ పరీక్షలు చేయించుకొని వచ్చారు. నెగెటివ్‌ వచ్చి న వారినే ప్రయాణానికి అనుమతించారు. అయినా తాజా మార్గదర్శకాల ప్రకారం వారందరికీ ఈ పద్ధతిలో నిర్ధారణ పరీక్షలు చేస్తారు. మరోవైపు 21 రోజులుగా ఒక్క కేసూ నమోదుకాని గ్రీన్‌జోన్‌ జిల్లాలకు చెందిన వారికీ నిర్ణీత సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తారు. దీనివల్ల ఆయా జిల్లాల్లో వైరస్‌ వ్యాప్తి తీవ్రతను తెలుసుకోవడానికి వీలవుతుంది.