అల్లు అర్జున్ పాటకి డాన్స్ చేసిన ఆస్ట్రేలియా టాప్ క్రికెటర్ డేవిడ్‌ వార్నర్‌

అలాగే మరో పాట ‘బుట్టబొమ్మ... బుట్టబొమ్మ...’ ఇది కూడా చిన్నారుల నుంచి పెద్దవాళ్ల వరకు అందర్నీ తెగ ఆకట్టుకుంది. అందుకేనేమో కంగారూ డాషింగ్‌ బ్యాట్స్‌మన్‌కూ ఇదే నచ్చింది. ఇంకెం!! తన భార్య క్యాండీస్‌తో కలిసి ఆ చిత్రగీతంలోని స్టెప్పుల్ని అనుకరిస్తూ డాన్స్‌ చేశాడు. వీడియోలో వార్నర్, క్యాండీస్‌ కెమిస్ట్రీ కూడా వర్కవుటైంది. అందుకే ఆ పాటలాగే వీరి డాన్స్‌ అదిరిపోయింది. సన్‌రైజర్స్‌ జెర్సీ వేసుకొని చిందులేసిన వార్నర్‌ పాట బాగుందని బన్నీ (అర్జున్‌)ని ఉద్దేశిస్తూ ట్వీట్‌ చేయగా... హీరో థ్యాంక్యూ చెప్పారు. ఇక సామాజిక మీడియాలో... పైగా ఈ లాక్‌డౌన్‌ సీజన్‌లో ఎవరు మాత్రం ఈ వీడియో చూడకుండా ఉంటారు! లైక్‌ కొట్టకుండా ఎవరుంటారు!! అందుకే ఆ పాట... వార్నర్‌ దంపతుల సయ్యాట తెగ వైరల్‌ అవుతోంది.