దేశ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోన : రోజుకి వేలల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు

జాతీయం : దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ రోజు రోజు అధికంగా వ్యాప్తి చెందుతుంది . కరోనా కట్టడికి కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించిన కరోనా కేసులు బయట పడటం ఆగట్లే , ఈ నేపథ్యంలో, భారత్‌లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2,553 కరోనా కేసులు నమోదు కాగా, 72 మంది దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 42,553కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 11,706 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా, 1,373 మంది మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 29,453 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 12,974 కరోనా కేసులు నమోదు కాగా, 548 మంది మృతిచెందారు. ఆ తర్వాత గుజరాత్‌లో 5,428, ఢిల్లీలో 4,549, తమిళనాడులో 3,023, రాజస్తాన్‌లో 2,886, మధ్యప్రదేశ్‌లో 2,846, ఉత్తరప్రదేశ్‌లో 2,645 కరోనా కేసులు నమోదయ్యాయి.