కోహ్లి... ఫెడరర్‌లాంటోడు: డివిలియర్స్‌

టెన్నిస్‌లో స్విట్జర్లాండ్‌ దిగ్గజం, ఆల్‌ టైమ్‌ గ్రేట్‌ రోజర్‌ ఫెడరర్‌ ఎలాగో క్రికెట్లో భారత కెప్టెన్‌ కోహ్లి అంతటోడని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ ఏబీ డివిలియర్స్‌ అన్నాడు. అలాగే ఆస్ట్రేలియన్‌ స్టార్‌ స్టీవ్‌ స్మిత్‌ను మరో మేటి టెన్నిస్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌)తో పోల్చాడు. జింబాబ్వే మాజీ క్రికెటర్‌ ఎంబాగ్వాతో జరిగిన లైవ్‌చాట్‌లో ఏబీ మాట్లాడుతూ... సమకాలీన టెన్నిస్‌లో ఫెడరర్, నాదల్‌లలాగే... సమకాలీన క్రికెట్‌లో విరాట్, స్మిత్‌ సరిగ్గా అలాంటివాళ్లేనని చెప్పుకొచ్చాడు. వీళ్లిద్దరూ ప్రేక్షకుల్ని రంజింప చేసే ఆటగాళ్లని కితాబిచ్చాడు. ప్రేక్షకులు క్రికెట్‌కు ఎగబడేలా వారిద్దరి ఆట ఉంటుందని అన్నాడు.