కేంద్ర ప్రభుత్వానికి సీపీఐ డిమాండ్‌

సీపీఐ జాతీయ సమితి పిలుపు మేరకు చేపట్టిన ఈ దీక్షలో రాష్ట్రంలో వలస కార్మికులు, అసంఘటిత కార్మికులు, చేతి వృత్తిదారులకు ప్రభుత్వం రూ. 7 వేలు చొప్పున ఆర్థిక సాయం, వడగళ్ల వాన వల్ల నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం, ఉపాధి హామీ కూలీలకు వసతులు కల్పించాలని, తెల్లకార్డులు లేని అర్హులñను పేదలను ఆదుకోవాలని సీపీఐ నాయకులు డిమాండ్‌ చేశారు. ప్రైవేట్‌ వైద్య, విద్యాసంస్థలలో పని చేస్తున్న ఉద్యోగులకు పూర్తి వేతనాలు ఇప్పించాలని, వరి కొనుగోలు క్వింటాకు 5 కిలోల తరుగు విధానంపై చర్యలు తీసుకొని రైతులను ఆదుకోవాలని కోరారు.