జియో యూజర్స్ కి బంపర్ ఆఫర్ : తక్కువ రేట్ లో ఎక్కువ డాటా


జాతీయం , బిజినెస్ , టెక్నాలజీ : దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్‌ జియో తమ ఖాతాదారులకు దాదాపు 75 శాతం తక్కువ ధరలతో అదనపు డాటాను అందించేందుకు కొత్త టాప్‌-అప్‌ ప్లాన్లను ప్రవేశపెట్టింది. అంతేకాకుండా రోజువారీ 4జీ డాటా పరిమితిని 2 జీబీకి పెంచడం ద్వారా తమ వార్షిక రీచార్జి ప్లాన్లను ప్రత్యర్థి కంపెనీల ప్లాన్ల కంటే 33 శాతం చౌకగా మార్చింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇండ్ల నుంచి విధులు (వర్క్‌ ఫ్రం హోం) నిర్వర్తిస్తున్నవారి కోసం'కొత్తగా రూ.151 (30 జీబీ), రూ.201 (40 జీబీ), రూ.251 (50 జీబీ) ప్లాన్లను తీసుకొచ్చింది. రోజువారీ డాటా పరిమితి ముగిసిన తర్వాత అదనపు డాటా వినియోగానికి ఈ ప్లాన్లు ఉపకరిస్తాయి. ఈ ప్లాన్ల ద్వారా ఒక్కో జీబీ డాటా దాదాపు రూ.5కే లభ్యమవుతుంది. ప్రస్తుతం రూ.8.50 నుంచి రూ.21 వరకు ధరలతో అందుబాటులో ఉన్న వేర్వేరు టాప్‌-అప్‌ ప్లాన్లలో జియో ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే ప్రస్తుతం రూ.2,121 ప్లాన్‌ కింద 336 రోజులపాటు అపరిమిత కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌లు, రోజుకు 1.5 జీబీ 4 జీబీ చొప్పున డాటా అందజేస్తున్న జియో తాజాగా ఆ ప్లాన్‌ను సవరించింది. రూ.2,399 వార్షిక ప్లాన్‌తో 365 రోజులపాటు అపరిమిత కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌లు, రోజుకు 2 జీబీ చొప్పున డాటాను అందజేయనున్నట్టు ప్రకటించింది. డాటాపరంగా చూస్తే ఈ ప్లాన్‌ ప్రత్యర్థి కంపెనీల వార్షిక ప్లాన్ల కంటే 33 శాతం చౌక. ప్రస్తుతం రోజుకు 1.5 జీబీ చొప్పున 4జీ డాటాతో ఇలాంటి వార్షిక ప్లాన్‌ను భారతీ ఎయిర్‌టెల్‌ రూ.2,398కి, వొడాఫోన్‌ ఐడియా రూ.2,399కి అందజేస్తున్నాయి.

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )