ఆరోగ్య సేతు యాప్‌ ఇకపై అన్ని స్మార్ట్‌ ఫోన్‌లలో ఖచ్చితంగా ఉండాలి వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం

కరోనా (కోవిడ్‌-19)పై సమగ్ర సమాచారమిచ్చే ఆరోగ్య సేతు యాప్‌ ఇకపై అన్ని స్మార్ట్‌ ఫోన్‌లలో కచ్చితంగా ఉండనుంది. ఫోన్‌ను అమ్మడానికి ముందే ఆ యాప్‌ను అన్ని స్మార్ట్‌ ఫోన్‌లలో ఇన్‌స్టాల్‌ చేయడంతో పాటు, ఆ యాప్‌లో రిజిస్టర్‌ చేసుకున్నాకే వినియోగదారుడు ఆ ఫోన్‌ను వాడేలా చూడాలని కేంద్రం ఆదేశాలు జారీకి సిద్ధం అవుతోంది. ఇందుకు సంబంధించి టెలికం సంస్థలతో సంప్రదింపులు జరిపేందుకు ఒక నోడల్‌ ఏజెన్సీని కూడా నియమించాలనుకుంటోందని సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి.