సహాయం కోసం వేలం

కరోనా వల్ల ప్రపంచం ముందుకు వెళ్లకుండా ఆగిపోయిందంటే అతిశయోక్తి కాదు. ఈ ప్రభావం అందరి మీదా పడింది. ఈ సమయంలో ఇబ్బందుల్లో ఉన్నవారికి ఎవరికి తోచిన స్థాయిలో వారు సహాయం చేస్తున్నారు. సినిమా స్టార్స్‌ కుడా విరాళాలు ఇస్తూ, ఫ్యాన్స్‌ని  సహాయం చేయమని పిలుపునిస్తూ ఉన్నారు. తాజాగా నిత్యా మీనన్‌ కరోనా వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలు గ్రామాలకు సహాయం చేయదలచుకున్నారు. అందుకోసం ఓ భిన్నమైన దారిని ఎంచుకున్నారు. గతంలో ఓ ఫ్యాషన్‌ షో కోసం తాను వేసుకున్న డిజైనర్‌ డ్రెస్‌ని వేలం వేస్తున్నారు నిత్య. ఈ వేలం ద్వారా వచ్చే మొత్తాన్ని ఓ ఫౌండేషన్‌ ద్వారా పలు గ్రామాలకు సహాయం చేయాలనుకుంటున్నారు.