వలస కార్మికులను పంపిస్తాం.....

రెండ్రోజుల్లో ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే వీరిని తరలించనున్నారు. బస్సులు, ట్రైన్ల సంఖ్య చూసుకున్న తరువాత అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వారిని సొంత ఊర్లకి తరలించనున్నారు. వీరితో పాటు సొంత వాహనం ఉంటే సాధారణ ప్రజలను కూడా రాష్ట్రం దాటి వెళ్లడానికి అనుమతించనున్నట్లు తెలుస్తోంది. అయితే తమ ఊర్లకు వెళ్లిన వీరు 28 రోజుల పాటు క్వారంటైన్లో ఉండటానికి ఇష్టపడితేనే తరలిస్తామని షరతు పెట్టింది. దీనికి ఒప్పుకొనే అనేక మంది సొంత ఊర్లకి వెళ్లడానికి ఒప్పుకుంటున్నారు. ఇదిలా ఉండగా తెలంగాణలో మే నెలాఖరు వరకు లాక్‌డౌన్‌ను పొడిగించే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి తెలంగాణ కేబినెట్‌ నిర్ణయం తీసుకోనుంది.