తక్కువ ధరకే ఎక్కువ బంగారం : నేటి నుండే గోల్డ్‌ బాండ్ల జారీ ప్రక్రియ


జాతీయం , బిజినెస్ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను రెండో విడత సావరిన్‌ గోల్డ్‌ బాండ్ల జారీ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈసారి గోల్డ్‌ బాండ్‌ యూనిట్‌ ధరను రూ.4,590గా నిర్ణయించినట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. పసిడి బాండ్ల సబ్‌స్ర్కిప్షన్‌ ఈ నెల 15వ తేదీన ముగియనుంది. బాండ్ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడంతోపాటు డిజిటల్‌ చెల్లింపులు చేపట్టే వారికి గ్రాముకు రూ.50 డిస్కౌంట్‌ను ఇవ్వనున్నారు. డిజిటల్‌ రూపంలో బంగారం కొనుగోళ్లను ప్రోత్సహించేందుకు 2015 నవంబరులో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. బ్యాంకులు, స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌హెచ్‌సీఐఎల్‌), ఎంపిక చేసిన పోస్టాఫీసులు, స్టాక్‌ ఎక్స్ఛేంజీలు (ఎన్‌ఎ్‌సఈ, బీఎ్‌సఈ) ద్వారా వీటిని కొనుగోలు చేయవచ్చు. బాండ్ల కాలపరిమితి 8 ఏళ్లు. అవసరమైతే, 5 ఏళ్ల తర్వాత పెట్టుబడులను ఉపసంహరించుకునే వీలుంటుంది. 

 ( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )