రెండు రోజుల వ్యవధిలో ఓ కుటుంబంలో తండ్రీ కొడుకులిద్దరు మృత్యువాత

తెలంగాణ :  కరోనా ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. రెండు రోజుల వ్యవధిలో ఆ కుటుంబంలో తండ్రీ కొడుకులిద్దరు మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళ్తే...మలక్‌పేట గంజ్‌లో నూనె వ్యాపారం చేసే వ్యక్తి అస్వస్థతకు గురై వనస్థలిపురంలోని ఓ ఆసుపత్రిలో ఇటీవల చికిత్స పొందగా అతని ద్వారా వనస్థలిపురం ఏ–క్వార్టర్స్‌లో నివాసం ఉండే తండ్రి (76), తమ్ముడు (45), ఇతర కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్‌ వచి్చన సంగతి తెలిసిందే. కాగా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తండ్రి మృతిచెందగా, శుక్రవారం కుమారుడు (గంజ్‌ వ్యాపారి తమ్ముడు) కూడా మృతి చెందాడు. వీరి కుంటుంబానికి చెందిన మరో నలుగురు ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక గంజ్‌ వ్యాపారి ఇప్పటికే గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా అతని భార్య, కుమారునికి కూడా కరోనా పాజిటివ్‌ అని తేలడం, అలాగే బీఎన్‌రెడ్డినగర్‌ ఎస్‌కేడీనగర్‌లో నివాసం ఉండే మరో కుటుబంలోని ఇద్దరికి పాజిటివ్‌ రావడంతో మూడు కుటుంబాలకు చెందిన బంధువులు అందరు గాంధీ ఆసుపత్రిలోనే  ఉన్నారు. దీంతో  మృతుల అంత్యక్రియల ను మున్సిపల్‌ అధికారులే నిర్వహించాల్సి వస్తోంది.