తుది వీడ్కోలు: తండోప తండాలుగా జనం

జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో సోమవారం ఉగ్రవాదులు జరిపిన దాడిలో ముగ్గురు సీఆర్‌పీఎఫ్‌ సైనికులు అమరులయ్యారు. అశ్వినికుమార్‌తో పాటు సంతోష్‌కుమార్‌ మిశ్రా, చంద్రశేఖర్‌ అనే సైనికులు మరణించారు. ఈ ముగ్గురికి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ట్విటర్‌ ద్వారా నివాళులు అర్పించారు. దేశం కోసం ఈ ముగ్గురు అమరవీరులు చేసిన త్యాగం సాటిలేనిదని, వీరిని చూసి తామంతా గర్విస్తున్నామని ట్వీట్‌ చేశారు. కుటుంబ భారాన్ని మోస్తున్న అశ్వినికుమార్‌ మరణంతో అతడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు