వేట నిషేధ సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వ సాయం

మత్స్యకారులకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేల  సాయాన్ని అందించనుంది. దీంతో మొత్తం 1,09,231 మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతుంది. ప్రతి మత్స్యకార కుటుంబానికి రూ.10 వేల చొప్పున నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే ప్రభుత్వం నగదు జమ చేయనుంది. లాక్ డౌన్, సముద్రంలో చేపల వేటపై నిషేధం కారణంగా ఈ ఏడాది 3 నెలలపాటు మత్స్యకారులు ఉపాధిని కోల్పోయారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ మత్స్యకార భరోసా కింద అందిస్తున్న సాయం వారిని ఆదుకోనుంది.