ఆర్‌బీఐపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు

అంతర్జాతీయం :  రుణాల వాయిదా చెల్లింపునకు సంబంధించి విధించిన మారటోరియం పక్కాగా అమలయ్యేలా చూడాలని రిజర్వ్‌ బ్యాంక్‌కు సుప్రీం కోర్టు సూచించింది. ఈఎంఐలను కొంతకాలం వాయిదా వేసుకునే వెసులుబాటును ఆర్‌బీఐ ఇచ్చినప్పటికీ.. రుణగ్రహీతలకు బ్యాంకులు ఆ ప్రయోజనాన్ని పూర్తిగా అందిస్తున్నట్లు కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలోనే మారటోరియంనకు సంబంధించిన మార్చి 27నాటి ఆదేశాలు సరిగ్గా అమలయ్యేలా తగు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ అంశంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది.   కరోనా వైరస్‌పరమైన కష్టకాలంలో వాయిదాలు చెల్లించేందుకు  ఆర్‌బీఐ మూడు నెలల పాటు మారటోరియం విధించిన సంగతి తెలిసిందే.