ఇప్పుడు మరో తమిళ సినిమా ఒప్పుకున్న మెగా హీరోయిన్ నిహారిక కొణిదెల

సినిమాలు : ‘ఒరు నల్ల నాళ్‌ పాత్తు సొల్రేన్‌’ (2018) సినిమాతో తమిళ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నిహారిక కొణిదెల. ఇప్పుడు మరో తమిళ సినిమా అంగీకరించారు. తమిళ యంగ్‌ హీరో అశోక్‌ సెల్వన్‌ ముఖ్య పాత్రలో ఓ రొమాంటిక్‌ కామెడీ తెరకెక్కనుంది. స్వాతిని ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయం కానున్నారు. ఇందులో నిహారిక హీరోయిన్‌గా నటించనున్నారు. పూర్తి స్థాయి కామెడీతో ఈ  కథాంశం ఉండబోతోందట.             ‘‘తమిళంలో మరో సినిమా చేయబోతున్నాను. షూటింగ్‌ ఎప్పుడు స్టార్ట్‌ అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు నిహారిక.