కొనుగోలు చేసిన ట్రాక్టర్లను ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు.

రంగారెడ్డి జిల్లా : శంకర్ పల్లి మున్సిపాలిటీలో కొనుగోలు చేసిన ట్రాక్టర్లను ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి  శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు,పాల్గొన్న  చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య గారు శంకర్ పల్లి మున్సిపల్ చైర్ పర్సన్ సాత విజయలక్ష్మి, వైస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి జడ్పీటీసీ గోవిందమ్మ గోపాల్ రెడ్డి గుడిమల్కాపూర్ మార్కెట్ చైర్మన్ వెంకట్ రెడ్డి కౌన్సిలర్లు పాల్గొన్నారు.

కొనుగోలు చేసిన ట్రాక్టర్ లను ప్రారంభించిన అనంతరం ఆమె స్వయంగా ట్రాక్టర్ ను నడిపారు

తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ శంకర్ పల్లి మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని కొనుగోలు చేసిన ట్రాక్టర్ లను ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు... 

80గజాల లోపు ఉన్న వారు ఇంటి అనుమతి లేకుండా ఇల్లు కట్టుకునే విధంగా కేసీఆర్ గారు జీఓ తీసుకువచ్చారని అన్నారు .శంకర్ పల్లి మున్సిపాలిటీ హైదరాబాద్ కి దగ్గరలో ఉన్నందున వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు...