మానవత్వమే మన మతం

కరోనా కష్టకాలంలో పేదలు చాలా మంది జీవనోపాధి కోల్పొయి ఆకలితో అలమటిస్తున్నారు. ఒక్కపూట ఆహారం కూడా దొరకక కుటుంబంతో కలసి పస్తులు ఉంటున్నారు. రోజు పనికి వెళితే కానీ పూట గడవని బడుగు జీవులు బాధతో వస్తున్న కన్నీటిని దిగమింగుతూ భోజనం పెట్టి ఆదుకునే వారి కోసం ఆశగా ఎదురు చూస్తు​న్నారు. వారిని ఆదుకునేందుకు అనేక స్వచ్ఛంధ సంస్థలతో పాటు సామాన్యులు సైతం చేతనైనంత సాయం అందిస్తున్నారు. కృష్ణాజిల్లా ఉయ్యూరులో ఆర్‌ఎంపీగా పనిచేస్తున్న నగిపోగు కోటేశ్వర రావు కరోనా కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో ఉపాధి కోల్పొయిన వారికి ఆహారాన్ని అందిస్తూ ఆకలి తీరుస్తున్నారు. నిరుపేదలు, నిరాశ్రయులతో పాటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి   చిక్కుకుపోయిన లారీ డ్రైవర్లకు కూడా భోజనాన్ని అందిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.