300 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్‌

లాభాల స్వీకరణతో నిన్న నష్టాలో ముగిసిన మార్కెట్‌ గురువారం మళ్లీ లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌  291 పాయింట్లు పెరిగి 34272.23 వద్ద, నిఫ్టీ 70 పాయింట్ల లాభంతో 10100 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు కొనసాగుతుండటం మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచింది. ఒక్క రియల్టీ రంగ షేర్లకు తప్ప మిగిలిన అన్నిరంగాలకు చెందిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. బ్యాంకింగ్‌, అటో, మెటల్‌ షేర్లు మార్కెట్‌ ర్యాలీని కొనసాగిస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 1శాతం లాభపడి 20,585.65 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఎస్‌బీఐ, ఎల్‌అండ్‌టీ తో పాటు మొత్తం 32కంపెనీలు మార్చి క్వార్టర్‌ ఫలితాలను వెల్లడించనున్నాయి. 
ఉదయం గం.9:20ని.లకు సెన్సెక్స్‌ 300 పాయింట్లు పెరిగి 34268 వద్ద, నిఫ్టీ 90 పాయింట్ల లాభంతో 10119.55 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అబుదాబి ఆధారిత ముబదలా కంపెనీ రిలయన్స్‌ జియోలో 1.85శాతం వాటాను రూ.9,093.6 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. వాటా విక్రయ వార్తలతో రిలయన్స్‌ షేరు మునుపటి ముగింపు(రూ.1579.95)తో పోలిస్తే 2.38శాతం లాతపడి రూ.1617.70 వద్ద ట్రేడ్‌ అవుతోంది.