టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనే పట్టణాలు, పల్లెలు అభివృద్ధి చెందాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రరెడ్డి అన్నారు. వికారాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని మద్గుల్‌ చిట్టంపల్లిలో నూతనంగా నిర్మించిన జిల్లా పంచాయతీరాజ్‌ రిసోర్స్‌ సెంటర్‌ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించి అనేక భవనాలను నిర్మిస్తుందన్నారు.
ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. డీపీఆర్‌సీ ని నిర్మించడం ద్వారా ప్రజా ప్రతినిధులకు సమావేశాలు నిర్వహించుకునేందుకు అవకాశం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రజలకు చేరువలో ఉండి ప్రజా సమస్యలు తెలుసుకొని వెంటనే పరిష్కరించాలని తెలిపారు. ఎలాంటి పనులు పెండింగ్‌ ఉండరాదని అధికారులను ఆదేశించారు.