నేటి ప్రధాన వార్తలు

ఆంధ్రప్రదేశ్‌:
విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదంపై నేడు హైపవర్‌ కమిటీ విచారణ
సీసీఎల్ఏ నీరబ్‌కుమార్ ఛైర్మన్‌గా పరిశ్రమలశాఖ ప్రత్యేక కార్యదర్శి కరీకల్‌వలవన్..
 జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్‌, సీపీ ఆర్కేమీనా సభ్యులుగా హైపవర్ కమిటీ
ఇప్పటికే ప్రమాదంపై హైపవర్‌ కమిటీకి నివేదికలు అందించిన 5 కమిటీలు
కేంద్రం నియమించిన  కమిటీ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చించనున్న హైపవర్ కమిటీ
గ్యాస్‌ లీక్ ప్రభావిత ప్రాంతాల్లో చిన్నారులకు ఆరోగ్య పరీక్షలు..
స్టైరిన్ ప్రభావంపై అధ్యయనం చేస్తున్న వైద్య నిపుణులు
తాడేపల్లి: వైఎస్సార్‌ వాహనమిత్ర ఆర్థిక సాయం విడుదల
నేడు సీఎం వైఎస్‌ జగన్‌ చేతుల మీదగా లబ్ధిదారులకు చెల్లింపు
నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం వైఎస్‌ జగన్‌
క్యాంపు కార్యాలయం నుంచి ఆన్‌లైన్‌లో ప్రారంభించనున్న సీఎం జగన్‌
2,62,493 మంది లబ్ధిదారులకు నేరుగా రూ.10 వేలు చొప్పున జమ
గత ఏడాది కంటే అదనంగా 37,756 మంది వాహన మిత్ర లబ్ధిదారులు
ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం అక్టోబర్‌లో ఇవ్వాల్సి ఉన్నా..
   కరోనా కష్టాల నేపథ్యంలో నాలుగు నెలల ముందుగానే సాయం
తెలంగాణ:
హైదరాబాద్‌: నేడు జలసౌధలో కృష్ణా బోర్డు భేటీ
కృష్ణా నదీ జల వివాదాలపై చర్చించనున్న ఇరు రాష్ట్రాల కార్యదర్శులు, ఇంజనీర్లు