అధికారులు వారిస్తున్నా పట్టించుకోని జనం

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. రోజురోజుకు వైరస్‌ వ్యాప్తి విస్తృతమవుతోంది. నగరంలోనే కాకుండా జిల్లావాసులను సైతం ఆవహిస్తోంది. కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. జిల్లాలో ఇప్పటి వరకు 143 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 84 మంది డిశ్చార్జ్‌ కాగా.. ఒకరు మృతి చెందారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 58 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం పకడ్బందీగా లాక్‌డౌన్‌ను అమలు చేసినా.. ఎన్‌ఆర్‌ఐ, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి ద్వారా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇటువంటి సమయంలో ఇళ్లకే పరిమితమవ్వాల్సిన ప్రజలు తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

వైరస్‌ తమకు సోకదన్న భావనతో ఇష్టానుసారంగా రోడ్ల మీదకు వస్తున్నారు. వైరస్‌ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోకుండా కుటుంబ సభ్యుల ఆరోగ్యాలను సైతం పనంగా పెడుతున్నారు. వైద్యులు ఎన్ని సూచనలు చేస్తున్నా.. అధికారులు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కరోనాకు వ్యాక్సిన్‌ లేదా మందు లేదన్న విషయం తెలిసినప్పటికీ.. సామాజిక స్పృహను మరచి ప్రవర్తిస్తున్నారు. ప్రజలు మేలుకోకపోతే.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోతే.. భవిష్యత్తులో వైరస్‌ వ్యాప్తిని అరికట్టడం అసాధ్యమని వైద్యులు సైతం హెచ్చరిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు కొంత కఠినంగా వ్యవహరిస్తున్నారు.  
 
లాక్‌డౌన్‌–5లో కేంద్ర ప్రభుత్వం కంటైన్మెంట్‌ జోన్లలో మినహా మిగిలిన ప్రాంతాల్లో సాధార ణ కార్యకలాపాలకు అనుమతులిచ్చింది. అయి తే తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని ని బంధన కూడా విధించింది. సడలింపులు రావడంతో వ్యాపార కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. రెండు నెలల పాటు ఇళ్లకే పరిమితమైన ప్రజలు ఒక్కసారిగా రోడ్ల మీదకు వస్తున్నారు. దీంతో ప్రధాన జంక్షన్లు జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. భౌతిక దూరం పాటిస్తూ ప నులు చేసుకోవాలన్న   సూచనలను కొందరు గాలికి వదిలేస్తున్నారు. ఇష్టానుసారంగా, అవ సరం లేకున్నా బయట తిరుగుతున్నారు. కొంత మంది ఏకంగా బీచ్‌రోడ్లలో పారీ్టలు సైతం చేసుకుంటున్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి రెస్టారెంట్లు, భారీ షాపింగ్‌ మాల్స్‌ కూడా ప్రా రంభం కానున్నాయి. దీంతో జన సంచారం మ రింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే జాగ్రత్తలు తీసుకుంటూ కా ర్యకలాపాలు నిర్వహించుకుంటే వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు.