ప్రతి ఒక్కరూ గోసేవ చెయ్యాలి చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగారాజన్ పంతులు

ప్రతి ఒక్కరూ గోసేవ  చెయ్యాలి  చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు  రంగారాజన్ పంతులు

రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని పొద్దుటూరు గ్రామ సమీపంలోని గోశాలలో  సుమారు 300 గోవులు ఉన్నాయి.గోవుల యజమానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్న విషయం తెలుసుకున్న చిలుకూరు బాలాజీ దేవాలయ అర్చకులు రంగరాజన్ స్వామి గారు గోవులకు కావలసిన ఒక లారీ పచ్చి గడ్డి వరి గడ్డి దాన చెరుకు   ఇవ్వడం జరిగింది. 

రంగరాజన్ పంతులు మాట్లాడుతూ గోమాత ఆకలిని తీర్చడంలో ప్రతి ఒక్కరూ బాగస్వాములు కావాలని ప్రతి భక్తుడు డబ్బులు ఇచ్చే అవసరం లేదని కానీ  వారు వాటికి కావలసిన పచ్చి గడ్డి వరిగడ్డి చెరుకు పిప్పి లాంటివి ఇవ్వాలని  కరోనా నుండి త్వరగా కోలుకోవాలంటే గోమాత సేవ అవసరమని అన్నారు.