కానిస్టేబుల్‌కు కరోనా..

మండలంలోని చెర్కుపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళకు గురువారం కరోనా పాజిటివ్‌ నిర్ధారణయ్యింది. మండల వైద్యాధికారి విజయ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన 50సంవత్సరాలు గల ఓ మహిళ భర్త అనారోగ్యం బారిన పడటంతో చికిత్స కోసం పది రోజుల కిత్రం సూర్యాపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ వివిధ పరీక్షలు చేసిన అనంతరం కిడ్నీ సంబంధిత వ్యాధిగా గుర్తించిన వైద్యుల సలహా మేరకు కుటుంబ సభ్యులు అతడిని హైదరాబాద్‌లోని కామినేని అస్పత్రికి తరలించారు. సదరు వ్యక్తికి తోడుగా అతడి భార్య కూడా ఆస్పత్రికి వెళ్లింది. రెండు రోజుల కిత్రం భర్తకు తోడుగా వెళ్లిన భార్యకు తీవ్ర జ్వరం లక్షణాలు కనిపించటంతో అనుమానం వచ్చిన ఆస్పత్రి వైద్యులు కరోనా వైరస్‌ టెస్టు కోసం శాంపిల్స్‌ను గాంధీ ఆస్పత్రికి పంపించారు. సదరు మహిళకు కరోనా పాజిటివ్‌ ఉందని రిపోర్టు రావడంతో వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు.
చెర్కుపల్లిలో అధికారుల పర్యటన..
  • కోవిడ్‌ భారిన మహిళ స్వగ్రామమైన చెర్కుపల్లిలో తహసీల్దారు డి.వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ లక్ష్మారెడ్డి, ఎస్‌ఐ బి.రామక్రిష్ణ, మండల వైద్యాధికారి విజయ్‌కుమార్, సీహెచ్‌ఓ సుందర్‌నాయక్,  బి.శ్యాంసుందర్‌రెడ్డి, స్థానిక సర్పంచ్‌ బొస్క ప్రసాద్‌ గురువారం గ్రామంలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. బాధితురాలి దగ్గరి బంధువులను, సమీప నివాసగృహాల వారికి సంబంధించి 19మందిని గుర్తించిన అధికారులు స్క్రీనింగ్‌ పరీక్షలు చేసి హోంక్వారంటైన్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. సదరు మహిళ ద్వారా గ్రామంలో ఇంకా ఎంత మందికి కరోనా వైరస్‌ సోకిందోనని గ్రామస్తులు అందోళన చెందుతున్నారు.