నిత్యాగ్నిహోత్రం పాటించండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి-విశ్వ ఫౌండేషన్ అఖల్ కోట.

హైదరాబాద్ బడి చౌడి సుల్తాన్ బజార్ వద్ద గల అగ్నిహోత్ర హౌస్  నందు నిత్య అగ్నిహోత్రాన్ని ఆచరిస్తున్న పి.ఎస్ జాజు గారు నిత్యాగ్నిహోత్రం అనంతరం మాట్లాడుతూ ప్రతి నిత్యం ఉదయం సాయంత్రం అగ్నిహోత్రాన్ని ఆచరించడం వలన ప్రపంచ మానవాళికి శాస్త్రీయబద్ధంగా లాభదాయకమని తెలియజేస్తూ అగ్నిహోత్ర ఫలిత ఔషధ యుక్త వాతావరణం కారణంగా రోగాల వృద్ధి నిరోధం కలుగుతుందని, అంతటా ఆరోగ్యం నెలకొంటుంది అని అగ్నిహోత్ర ఆచరణ వలన మనోబలం వృద్ధి అవుతుందని అందువలన వ్యసనాల నుండి విముక్తి పొందటంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేశారు.