గోదాంపై విజిలెన్స్‌ దాడులు.. నకిలీ విత్తనాలు సీజ్‌

జిల్లాలోని కండ్లకోయ వద్ద ఇకో అగ్రీసీడ్స్‌ కంపెనీ గోదాంపై విజిలెన్స్‌ అధికారులు నేడు రైడ్‌ చేశారు. ఈ సందర్భంగా జరిపిన తనిఖీల్లో అధికారులు నకిలీ జొన్న, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న విత్తనాలను గుర్తించారు. నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్న అధికారులు గోదాంను సీజ్‌ చేశారు. పట్టుబడ్డ నకిలీ విత్తనాల విలువ రూ. 31 లక్షలుగా సమాచారం.