ఈసారి మాత్రం త‌న‌కు మామిడి పండ్లు అంద‌లేద‌ని కాస్త నిరాశ‌

తెలుగు ఇండ‌స్ట్రీలో ప‌వ‌ర్ స్టార్ , క‌మెడియ‌న్ అలీ స్నేహానికి మంచి పేరుంది. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ ఎంతో క‌లిసిమెలిసి ఉండేవారు. సినిమాల్లోనూ వాళ్లిద్ద‌రూ ఒకే సీన్‌లో క‌నిపించారంటే కామెడీ పంట‌ పండిన‌ట్టే. అయితే రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించిన త‌ర్వాత ఈ ఇద్ద‌రి మ‌ధ్య‌ గ్యాప్ వ‌చ్చింది. గతేడాది ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ ఒక‌రిపై మరొక‌రు తీవ్ర‌ విమ‌ర్శ‌లు చేసుకున్న విష‌యం తెలిసిందే. లాక్‌డౌన్‌లో ఇంటిప‌ట్టునే ఉంటున్న అలీ తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఉన్న అనుబంధం గురించి మాట్లాడారు. ప‌వ‌న్ త‌న‌కు ప్ర‌తి ఏడాది మామిడి పండ్లు పంపేవార‌ని పేర్కొన్నారు. కానీ ఈసారి మాత్రం త‌న‌కు మామిడి పండ్లు అంద‌లేద‌ని కాస్త నిరాశ‌కు లోన‌య్యారు.