కరోనాను జయించిన 101 ఏళ్ల వృద్ధురాలితో వైద్యాధికారి

కరోనాను జయించడానికి మందులతో పాటు, మానసిక ధైర్యం కూడా ప్రధానమని వైద్యులు చెబుతున్నారు. ఇందుకు ఉదాహరణగా నిలిచింది తిరుపతికి చెందిన 101 ఏళ్ల సి.మంగమ్మ. శతాధిక వయసులోనూ కరోనాను ధీటుగా ఎదుర్కొన్న ఆమె ఇప్పుడు అందరికీ ఒక ధైర్యాన్నిస్తోంది.
మంగమ్మ స్విమ్స్‌ శ్రీపద్మావతి వైద్యశాలలో కరోనా నుండి కోలుకుని శనివారం ఇంటికి చేరింది. ఈ వయసులోనూ ఆమె ధైర్యంగా కనిపించిందని, ఆమె ప్రాణాలు నిలబడడానికి వైద్యంతో పాటు ఆమె గుండె ధైర్యమే కారణమని ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ రామ్‌ తెలిపారు.