► 1980లో ప్రారంభమైన రాకెట్ ప్రయోగాల పరంపర తొలినాళ్లలో సంవత్సరానికి ఒక ప్రయోగం లేదంటే రెండు సంవత్సరాలకు ఒక ప్రయోగాన్ని చేసేవారు.
► పెరిగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని 1999 నుంచి 2019 దాకా రాకెట్ ప్రయోగాల సంఖ్య పెరగడమే కాకుండా ఒక్క సంవత్సరం కూడా విరామం లేకుండా ప్రయోగాలు చేశారు.
► 2020 సంవత్సరాన్ని విజన్–2020గా తీసు కుని 12 ప్రయోగాలు చేయాలనుకున్నారు. అయితే ఒక్క ప్రయోగం కూడా చేయలేని సంవత్సరంగా 2020 మిగిలిపోయింది.
► ఈ ఏడాది గగన్‌యాన్ ప్రయోగానికి సంబంధించి ఎక్స్పరమెంటల్, చంద్రయాన్–2 ప్రయోగాన్ని కూడా చేయాలనుకున్నారు.
► 2020 ఏప్రిల్‌లోపు జీఎస్ఎల్వీ మార్క్–2, పీఎస్ఎల్వీ సీ49, పీఎస్ఎల్వీ సీ50 ప్రయోగాలను పూర్తి చేయాలనుకున్నారు. కానీ వీటన్నింటికి కరోనా బ్రేక్ వేసింది.
► షార్ కేంద్రంలో రాకెట్ ప్రయోగాలకు సంబంధించి ప్రత్యక్షంగా ఇస్రోకు సంబంధించిన వారు 2 వేల మంది
పనిచేస్తున్నారు.
► కాంట్రాక్టు పద్ధతిన మరో రెండు వేలమంది పని చేస్తున్నారు.
► కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసే వారంతా ఉత్తర భారతదేశానికి చెందిన వలస కూలీలు.
► లాక్డౌన్ మెదలైన తర్వాత వారందరూ స్వరాష్ట్రాలకు వెళ్లిపోయారు. దీంతో షార్‌లో పనులు నిలిచిపోయాయి.
► తాజాగా గత వారంలో షార్ కేంద్రంలోనూ కేసులు నమోదైన క్రమంలో లాక్డౌన్ ప్రకటించారు.
► ప్రస్తుతం షార్ కేంద్రంలో ఉన్న రాకెట్లకు, మూడు ఉపగ్రహాలకు కాపలా కాసే పనిలో ఉన్నారు.