తెలంగాణలో 1,473 కేసులు

రాష్ట్రంలో ఆదివారం కొత్తగా 1,473 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 55,532కు చేరింది. ఇందులో 42,106 మంది కోవిడ్‌–19 నుంచి కోలుకోగా 12,955 యాక్టివ్‌ కేసులున్నాయి. కరోనా వైరస్‌ ప్రభావంతో మరో 8 మంది మరణించగా మొత్తం మృతుల సంఖ్య 471కి చేరింది. రాష్ట్రంలో మరణాల సగటు 0.85 శాతంగా ఉంది. జాతీయ స్థాయిలో మరణాల రేటు 2.3 శాతంగా ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,63,242 శాంపిల్స్‌ పరీక్షించారు.
తాజాగా రాష్ట్రవ్యాప్తంగా 30 జిల్లాల్లో పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఇందులో అధికంగా జీహెచ్‌ఎంసీలో 506, రంగారెడ్డిలో 168, వరంగల్‌ అర్బన్‌లో 111, సంగారెడ్డిలో 98, కరీంనగర్‌లో 91, మేడ్చల్‌లో 86, నిజామాబాద్‌లో 41, మహబూబాబాద్‌లో 34, గద్వాలలో 32, సూర్యాపేట్‌లో 32, ఆదిలాబాద్‌లో 28, నల్గొండలో 28, ఖమ్మంలో 20, నాగర్‌కర్నూల్‌లో 19, సిరిసిల్లలో 19, జగిత్యాలలో 18, కామారెడ్డిలో 17, మెదక్‌లో 17, మంచిర్యాలలో 14, ములుగులో 12, సిద్దిపేట్‌లో 12, భువనగిరిలో 11, కొత్తగూడెంలో 10, జనగామ 10, భూపాలపల్లి 10, వనపర్తిలో 9, మహబూబ్‌నగర్‌లో 8, వరంగల్‌ రూరల్‌లో 8, వికారాబాద్‌లో 2, నారాయణపేట్‌లో 2 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.