ఏపీలో తాజాగా 3,257 మంది డిశ్చార్జ్‌

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో ఆస్పత్రుల నుంచి 3,257 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 49,558కి చేరినట్టు వైద్యారోగ్యశాఖ సోమవారం బులెటిన్‌లో పేర్కొంది. ఆదివారం ఉ.9 గంటల నుంచి సోమవారం ఉ.9 వరకు 43,127 మందికి పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 16,86,446కి చేరింది. కొత్తగా 6,051 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 1,02,349కి చేరాయి. తాజాగా 49 మంది మృతితో కలుపుకొని మొత్తం మరణాలు 1,090కి చేరాయి. యాక్టివ్‌ కేసులు 51,701 ఉన్నాయి.