9.9శాతం వాటా కొనుగోలుకు ఆసక్తి

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రిటైల్‌ వ్యాపార విభాగంలో అమెరికా ఆధారిత ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ 9.9శాతం వాటాను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతోందని తెలుస్తోంది. జియోమార్ట్‌లో వ్యూహాత్మక వాటాను కొనుగోలుకు అమెజాన్ ఆసక్తి చూపుతున్నట్లు కొన్ని ఆంగ్లఛానెల్స్‌ వెల్లడించాయి. కరోనా లాక్ డౌన్ టైమ్ ను సద్వినియోగం చేసుకోనేందుకు ఈ మేలో వాల్‌మార్ట్‌, అమెజాన్‌ డాట్‌కామ్‌కు పోటీగా రిలయన్స్‌ జియోమార్ట్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రిటైల్‌ వ్యాపార విభాగంలో అలాగే అమెజాన్‌ కూడా భారత్‌లో స్మార్ట్‌ స్టోర్స్‌ సదుపాయాన్ని ప్రారంభించింది.భారత్‌లోని చిన్న కిరాణా నెట్‌వర్క్‌ స్టోర్లను చేరుకోవడం కోసం జియోమార్ట్‌ ఈ సాంకేతికతను వినియోగిస్తోంది. ఇప్పటికే జియోమార్ట్‌ తన కొనుగోలుదార్లు వాట్సప్‌ ద్వారా ఆర్డర్లు పెట్టడానికి వీలుగా ఒక ఫీచర్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతానికి నవీ ముంబయి, థానే, కల్యాణ్‌ వంటి ఎంపిక చేసిన ప్రాంతాలకే దీనిని పరిమితం చేసింది. త్వరలోనే దేశంలోని ఇతర ప్రాంతాలకూ విస్తరించనుంది. అయితే ఈ అంశం స్పందించేందుకు ఇరు కంపెనీల అధికార ప్రతినిధులు నిరాకరించారు.