ఆనంద్‌కు రెండో ఓటమి

లెజెండ్స్‌ ఆఫ్‌ చెస్‌ ఆన్‌లైన్‌ టోర్నమెంట్‌లో భారత దిగ్గజ చెస్‌ ఆటగాడు విశ్వనాథన్‌ ఆనంద్‌కు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన రెండో రౌండ్‌ పోరులో ఆనంద్‌ 1.5–2.5తో ప్రపంచ నంబర్‌వన్‌ మాగ్నస్‌ కార్ల్‌సెన్‌ (నార్వే) చేతిలో ఓడాడు. ‘బెస్ట్‌ ఆఫ్‌ ఫోర్‌’ గేమ్స్‌ పద్ధ్దతిన జరిగిన ఈ మ్యాచ్‌లో... ఆనంద్‌ తొలి మూడు గేమ్స్‌ను ‘డ్రా’ చేసుకున్నాడు. అయితే చివరి గేమ్‌లో ఓడటంతో విజయం కార్ల్‌సెన్‌ ఖాతాలో చేరింది. తొలి రౌండ్‌లో పీటర్‌ స్విడ్లర్‌ (రష్యా) చేతిలో ఆనంద్‌ ఓడాడు. మూడో రౌండ్‌లో వ్లాదిమిర్‌ క్రామ్నిక్‌ (రష్యా)తో ఆనంద్‌ తలపడతాడు.