కొత్త సచివాలయం డిజైన్‌పై ఎల్లుండి ప్రకటన

తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు రెండు రోజుల పాటు కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్‌ సోమవారం సాగునీటి, ఆర్‌ అండ్‌ బీ శాఖలపై సుదీర్ఘంగా సమీక్షించనున్నారు. గోదావరి, కృష్ణా నదుల సాగునీటికి సంబంధించి అంశాలపై ఈ భేటీలో చర్చిస్తారు. భవిష్యత్‌లో గోదావరి కృష్ణా జలాల వినియోగంపై ఈ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. రేపు మధ్యాహ్నం నీటి పారుద‌ల‌శాఖ‌, ఎల్లుండి ఆర్‌ అండ్‌ బీ శాఖ‌పై స‌మీక్ష నిర్వ‌హించ‌నున్నారు. 
ఈ సమీక్షా సమావేశాలకు ఆయా శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ఇక సాగునీటి రంగానికి ఒకే గొడుకు కిందకు తీసుకు రావాలని ముఖ్యమంత్రి నిర్ణయించిన విషయం తెలిసిందే. మరోవైపు మంగళవారం మధ్యాహ్నం జరిగే సమావేశంలో కేసీఆర్ కొత్త సచివాలయం నిర్మాణంకి సంబంధించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం క్యాబినెట్ ఆమోదించిన తర్వాత డిజైన్లపై అధికారిక ప్రకటన చేస్తారు.