మాజీ మంత్రి కొప్పన మోహనరావు మృతి

మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత కొప్పన మోహనరావు(75) బుధవారం కన్నుమూశారు. కాకినాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన పిఠాపురం నియోజకవర్గం నుంచి రెండు పర్యాయాలు(1978,1989) కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. కోట్ల విజయభాస్కరరెడ్డి హయంలో అటవీ శాఖ మంత్రిగా పని చేశారు. పిఠాపురం నియోజకవర్గంలో కొప్పన వైఎస్సార్‌సీపీకి సేవలందించారు. ఆయన మృతి పట్ల ఎమ్మెల్యే పెండెం దొరబాబుతో పాటుగా పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.