ఏపీజీఐసీఎల్‌కు చైర్మన్‌గా ఎస్‌ఎస్‌ రావత్‌

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏపీ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు చైర్మన్‌, ఎండీలను నామినేట్‌ చేసింది. ఈ మేరకు మంగళవారం రోజున ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీజీఐసీఎల్‌కు చైర్మన్‌గా ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌, ఎండీగా ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శి కేవీవీ సత్యనారాయణను ప్రభుత్వం నియమించింది.