తార్నాకలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌ ఆత్మహత్య!

ఇంగ్లీష్ మరియు విదేశీ భాషల విశ్వవిద్యాలయం (ఇఫ్లూ)లో అసిస్టెంట్ ప్రొఫసర్‌గా పని చేస్తున్న రాహుల్ బలవన్మరణానికి పాల్పడ్డారు. తార్నాకలోని తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం బుధవారం వెలుగు చూసింది. భార్యతో విడాకులు తీసుకొని రాహుల్‌ ఒంటరిగా నివసిస్తున్నట్టు తెలిసింది. ఆయన స్వస్థలం విజయవాడ. కేసు నమోదు చేసుకొన్న ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.