అలవాటులో పొరపాటు.. అంపైర్లకు తిప్పలు

కరోనా వైరస్‌ సంక్షోభం కారణంగా ప్రపంచ క్రికెట్‌లో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ)అనేక కొత​ నిబంధనలను ప్రవేశపెట్టింది. ప్రధానంగా బంతిని లాలాజలంతో(సలైవా) రుద్ద కూడదనే నిబంధనను కచ్చితత్వం చేసింది. కాగా, ఈ నిబంధనలను తొలిసారి ఇంగ్లండ్‌ క్రికెటర్‌ డామ్‌ సిబ్లీ అతిక్రమించాడు. ఇంగ్లండ్‌-వెస్టిండీస్‌ల రెండో టెస్టులో భాగంగా నాల్గో రోజు సిబ్లీ రూల్స్‌ బ్రేక్‌ చేశాడు. బంతిని అందుకున్న మరుక్షణమే అనుకోకుండా చేతితో లాలాజలాన్ని బంతిపై రుద్ది నిబంధనలను ఉల్లంఘించాడు. నాలుగో రోజు లంచ్‌కు ముందు క్రిస్ ఓక్స్ ఓవర్ పూర్తవగానే బంతి సిబ్లీ చేతికొచ్చింది. బంతిని అందుకున్న సిబ్లీ అనుకోకుండా చేతి వేళ్లను నోటి దగ్గరకు పోనిచ్చాడు. వెంటనే లాలాజలాన్ని బంతిపై రుద్ది నాలుక కరుచుకున్నాడు. ఈ విషయం అంపైర్లకు తెలియడంతో బంతిని తీసుకుని శానిటైజర్‌ టవల్‌తో శుభ్రం చేశారు. సలైవా నిబంధనను మొదటిసారి బ్రేక్‌ చేసిన సిబ్లీ చర్యకు అంపైర్లకు తిప్పలు తప్పలేదు. ఏం చేయాలో తెలియక బంతిని శానిటైజ్‌ చేశారు.