రాజమౌళి ఫ్యామిలీకి కరోనా

దర్శకులు యస్‌.యస్‌. రాజమౌళి మరియు ఆయన కుటుంబ సభ్యులకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ట్వీటర్‌ ద్వారా  ప్రకటించారు రాజమౌళి. ‘‘కొన్ని రోజుల క్రితం నాకు, మా కుటుంబ సభ్యులకు కొద్దిగా జ్వరం వచ్చింది. దానంతట అదే తగ్గిపోయింది కూడా. కానీ ఎందుకైనా మంచిది అని కరోనా టెస్ట్‌ చేయించుకున్నాం.  ఈ రోజు (బుధవారం) రిజల్ట్‌ లో కరోనా పాజిటివ్‌ వచ్చింది. వైద్యుల సూచన మేరకు  అందరం  ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉంటున్నాం.. ఏ లక్షణాలు లేకుండా  మేమందరం బాగానే ఉన్నాం. అన్ని  సూచనలు పాటిస్తున్నాం. కరోనాలో నుంచి బయటపడి ప్లాస్మా దానం చేయడానికి సిద్ధంగా ఉన్నాం’’ అని రాజమౌళి అన్నారు.