► రాష్ట్రంలో ఎక్కువ కరోనా పాజిటివ్ కేసులు యువతకే వచ్చాయి.
► కోలుకున్నవారిలోనూ వీళ్లే ఎక్కువ.
► యాక్టివ్ కేసుల్లో 57.22 శాతం 40 ఏళ్ల లోపు వారివే.
► రికవరీలో 60 శాతం మంది యువతే.
► నిలకడగా ఆరోగ్యంగా ఉన్నవారిలో 47 శాతం మంది 40 ఏళ్ల లోపు వారే
► పాజిటివ్ కేసుల్లో 4.11 శాతం మంది 10 ఏళ్ల లోపు వాళ్లు ఉన్నారు.
► పాజిటివ్ కేసుల్లో 91 ఏళ్లు దాటినవారు 0.04 శాతం మంది ఉన్నారు.
► కరోనా వైరస్ యువతను పెద్దగా ప్రభావితం చేయడం లేదని తేలింది.
► 60 ఏళ్లు దాటిన వారిని జాగ్రత్తగా కాపాడుకుంటే బాధితుల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం
► 50 ఏళ్లు దాటి మధుమేహం, హైపర్టెన్షన్, గుండెజబ్బులు వంటివి ఉన్నవారిని జాగ్రత్తగా చూడాలి.
► వైరస్ వ్యాప్తి ఉంది కాబట్టి వీరు ఇంట్లోనే ప్రత్యేక గదిలో ఉండటం ఉత్తమం.
► ఆందోళన చెందకుండా అవసరమైతే 104 లేదా టెలీమెడిసిన్ 14,410 నంబర్లకు ఫోన్ చేస్తే సలహాలు, సూచనలు ఇస్తారు.
► స్థానిక వార్డు లేదా గ్రామ వలంటీర్లు, ఏఎన్ఎంలకు ఫోన్ చేస్తే కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేస్తారు.