అధికారులకు మంత్రి తలసాని ఆదేశాలు

రాష్ట్రంలో మెగా డెయిరీ నిర్మాణానికి నమూనా సిద్ధం చేయాలని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అధికారులను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా మామిడి పల్లిలో మెగా డెయిరీ నిర్మాణం కోసం పశుసంవర్థక శాఖకు చెందిన 32 ఎకరాల భూమిని విజయ డైయిరీకి 99 ఏళ్లు లీజుకు ఇస్తూ మంత్రి తలసాని, పశుసంవర్థక శాఖ కార్యదర్శి అనితా రాజేంద్ర సమక్షంలో ఆ శాఖ డైరెక్టర్‌ లక్ష్మారెడ్డి, డెయిరీ ఎండీ శ్రీనివాస్‌రావులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. మంత్రి తలసాని మాట్లాడుతూ.. ఆధునిక టెక్నాలజీతో రూ.250 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసే మెగా డైయిరీ నుంచి మరిన్ని విజయ ఉత్పత్తులు ప్రారంభించాలని కోరారు.