సీఐఐ సదస్సులో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్‌ వెల్లడి

వైఎస్‌ఆర్‌ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం సొంతగా నిర్మిస్తున్న ఉక్కు కర్మాగారంలో భాగస్వామ్యం కావడానికి జాతీయ, అంతర్జాతీయ ఉక్కు రంగ దిగ్గజ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయని రాష్ట్ర పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్‌ వెల్లడించారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఈ స్టీల్‌ ప్లాంట్‌లో భాగస్వామ్యం కోసం అనేక కంపెనీలు ముందుకు వచ్చాయని తెలిపారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ‘రాష్ట్రంలో ఉక్కు రంగం–సుస్థిరత’ అనే అంశంపై నిర్వహించిన జాతీయ స్థాయి వెబినార్‌ సదస్సులో వలవన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వెల్లడించిన అంశాలు.. 
► లాక్‌డౌన్‌ తరువాత పరిశ్రమలను తిరిగి ప్రారంభించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి సహకారం అందించింది.  
► ఉద్యోగుల ఆరోగ్య రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన కోవిడ్‌–19 ప్రోటోకాల్స్‌ను విధిగా పాటించాల్సిందిగా కోరుతున్నాం.