దూరదృష్టి కలిగిన నేత కేటీఆర్‌: తలసాని

దేశంలో ఎంతోమంది యువతకు రాజకీయ అవకాశాలు వచ్చినా, టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారక రామారావు తరహాలో రాజకీయాల్లో రాణించింది అతికొద్ది మంది మాత్రమేనని రాష్ట్ర పశుగణాభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. మంత్రి కేటీఆర్‌ జన్మదినం నేపథ్యంలో సిరిసిల్ల అభివృద్ధిపై పార్టీ నేత ఉప్పల శ్రీనివాస్‌గుప్తా రూపొందించిన సీడీని గురువారం తెలంగాణ భవన్‌లో తలసాని ఆవిష్కరించారు. కాగా, కేటీఆర్‌ చేపడుతున్న సంస్కరణలు రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ అన్నారు.