ఎయిర్‌పోర్టులో గంధపు చెక్కల కలకలం..

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో గంధపు చెక్కల అక్రమ రవాణా కలకలం సృష్టించింది. అక్రమంగా తరలిస్తున్న 114 కిలోల గంధపు చెక్కలను కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్‌ నుంచి ఖర్టూమ్‌కు అక్రమంగా తరలించేందుకు యత్నించిన వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. సూడాన్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించిన ఎయిర్‌పోర్ట్‌ అధికారులు.. అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.