పుట్టినరోజు ప్రత్యేక గీతాన్ని విడుదల చేసిన మాజీ ఎంపీ కవిత

మంత్రి కె.తారకరామారావు పుట్టినరోజును పురస్కరించుకుని ఆయనపై రూపొందించిన ‘వెనకడుగేయని కాలం పేరే కేటీఆర్‌’అనే ప్రత్యేక గీతాన్ని మాజీ ఎంపీ కవిత గురువారం మధుర ఆడియో సంస్థ ద్వారా విడుదల చేశారు. హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ సతీమణి శ్రీదేవి నిర్మాతగా వ్యవహరించారు. మిట్టపల్లి సురేందర్‌ రాసిన ఈ పాటకు భరత్‌ అడోనిస్‌ సంగీతాన్ని అందించగా, యాజీన్‌నిజార్‌ ఆలపించారు.