అందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలి

రాబోయే బక్రీద్‌ పండుగను పురస్కరించుకొని ఖురేషి సామాజిక వర్గానికి చెందిన ముస్లిం వ్యాపారులందరూ క­రో­నా పరీక్షలు చేయించుకోవాలని హైదరాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గం ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ అన్నారు. కరోనా పరీక్ష­లు చేయించుకోవడం ద్వారా తమను తా­ము కాపాడుకోవడమే కాకుండా సమాజా­న్ని కాపాడినట్లు అవుతుందన్నారు. మంగళవారం యాకుత్‌పురా ఎమ్మెల్యే సయ్యద్‌ అహ్మద్‌ పాషా ఖాద్రీతో కలిసి ఆయన చార్మినార్‌ యునానీ ఆసుపత్రిలోని కరోనా పరీక్షల కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ ఖురేషి సామాజిక వర్గానికి జరుగుతున్న కరోనా పరీక్షలను ఆయన పరిశీలించారు. బ­క్రీద్‌ పండుగ సందర్భంగా జరిగే మాంసం విక్రయాల్లో ఖురేషి సామాజిక వర్గానికి చెందిన వ్యాపారుల ప్రాధాన్యత ఎంతో ఉంటుందన్నారు. వీరందరూ ముందస్తుగా కరోనా పరీక్షలు చేయించుకుంటే ఆశించిన ఫలితాలు ఉంటాయన్నారు.