నేడు తెలంగాణ భవన్‌లో రక్తదాన శిబిరం

పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు అద్వితీయ విజయాలు సాధించారని ప్రభుత్వ విప్‌ కర్నె ప్రభాకర్‌ అన్నారు. కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా తెలంగాణ భవన్‌లో గురువారం జరిగిన పలు సేవా కార్యక్రమాల్లో జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం నేత సామ వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ప్రమాదవశాత్తూ మరణించిన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు బీమా మొత్తాన్ని పంపిణీ చేశారు.
కేటీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.