బాధితుల ధ‌ర్నా.. త‌మ స్థ‌లాల్లో ఎలా చేస్తారంటూ?

త‌మ‌కు కేటాయించిన ఇళ్ల‌స్థ‌లాల్లో హ‌రిత‌హారం చేప‌ట్ట‌డంపై బాధితులు ధ‌ర్నా చేప‌ట్టారు. ఈ ఘ‌ట‌న కొమురం భీం జిల్లా రెబ్బెన మండలం గోలేటిలో చోటుచేసుకుంది. వివ‌రాల ప్ర‌కారం గోలేటి శివారులోని సర్వే నంబర్ 141 లోఉన్న  భూమిని 2011లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించింది. అయితే తాజాగా రెవెన్యూ అధికారులు.. ఆ స్థ‌లాన్ని ప్ర‌భుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డు ఏర్పాటు చేయ‌డంతో వివాదం తలెత్తింది. నిరుపేద కుటుంబాల‌కు కేటాయించిన భూమిలో హ‌రిత‌హారం ప్లాంటేష‌న్ చేస్తామ‌ని గ్రామ పంచాయితీ అధికారులు చెప్ప‌డంతో వారిని అడ్డుకున్న బాధితులు ధ‌ర్నా చేప‌ట్టారు. త‌మ‌కు కేటాయించిన స్థ‌లంలో తాత్కాలిక గుడిసెలు ఏర్పాటు చేసుకొని బాధితులు ధ‌ర్నాకు దిగారు.