పతనమైన షేర్లకే అధిక ప్రాధాన్యత

ప్రస్తుత పరిస్థితుల్లో భారీగా నష్టాలను చవిచూసిన, అంతంత మాత్రం‍గా ఆదరణ ఉన్న షేర్లను మాత్రమే కొనుగోలు చేయడం ఉత్తమని దిగ్గజ ఇన్వెస్టర్‌ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా తెలిపారు. ఈ వ్యాఖ్యలకు కట్టుబడుతూ ఈ తొలి త్రైమాసికంలో ఈయన పతనమైన షేర్లను కొనుగోలు చేశారు. ఈ విషయం ఆయన ఫోర్ట్‌ఫోలియోను పరిశీలిస్తే అర్థమవుతోంది. అలాగే చిన్న మొత్తంలో అధిక షేర్లను తన పోర్ట్‌ఫోలియోలో చేర్చుకున్నారు. 
కరోనా కారణంగా మార్చిలో అధికంగా నష్టపోయిన అటోలైన్‌ ఇండస్ట్రీస్‌, దిక్సాన్‌ కార్బోజెన్‌, ఇండియన్‌ హోటల్స్‌ షేర్లను కొనుగోలు చేశారు. ఈ షేర్లను అధిక మొత్తంలో కాకుండా 1శాతానికి మించకుండా కొన్నారు. వీటితో పాటు ఎన్‌సీసీ, ఫస్ట్‌సోర్ట్స్‌ సెల్యూషన్స్‌, జుబిలెంట్‌ లైఫ్‌ సెన్సెన్స్‌, ర్యాలీస్‌ ఇండియా, ఎడెల్వీజ్‌ సర్వీసెస్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, డెల్టా కార్ప్‌ షేర్లను కూడా కొన్నారు. 
ఈ జూన్‌ క్వార్టర్‌ నాటికి అటోలైన్‌ ఇండస్ట్రీస్‌లో రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా దంపతులిద్దరూ 6.4శాతం వాటాను కలిగి ఉన్నారు. మార్చిలో ఉన్న మొత్తం వాటాతో పోలిస్తే ఈ క్యూ1లో కొద్దిగా వాటాలను విక్రయించినట్లు తెలుస్తోంది. అలాగే జూన్ త్రైమాసికంలో డిష్‌మెన్‌ కార్బోజెన్ అమ్సిస్‌లో వీరిద్దరూ 1.59 శాతం వాటాను కొనుగోలు చేశారు. ఇదే కాలంలో ఝున్‌ఝున్‌వాలా ఇండియన్‌ హోటల్స్‌లో 1.05శాతం వాటాను కొనుగోలు చేసి టాటా గ్రూప్‌లోకి ప్రవేశించారు. దురదృష్టవశాత్తు ఏడాది కాలంలో ఈ రెండు షేర్ల ప్రదర్శన అంతబాగోలేదు.