యస్‌ బ్యాంకు స్వాధీనంలోకి అనిల్‌ అంబానీ కార్యాలయం

అనిల్‌ అంబానీ గ్రూప్‌నకు చెందిన ముంబైలోని శాంతాక్రజ్‌లో ఉన్న ప్రధాన కార్యాలయాన్ని యస్‌ బ్యాంకు స్వాధీనం చేసుకుంది. బ్యాంకుకు రూ.2,892 కోట్లు బాకీ పడడమే ఇందుకు కారణం. అనిల్‌ ధీరూబాయ్‌ అంబానీ గ్రూప్‌లోని (అడాగ్‌) దాదాపు అన్ని ప్రధాన కంపెనీల కార్యకలాపాలు ఈ రిలయన్స్‌ సెంటర్‌ నుంచే సాగుతున్నాయి. బాకీలను చెల్లించేందుకై  21,432 చదరపు మీటర్ల విస్తీర్ణంలోని ఈ ఆఫీసును లీజుకు ఇవ్వాలని కంపెనీ గతేడాది ప్రయత్నించింది. రిలయన్స్‌ ఇన్‌ఫ్రాకు చెందిన రెండు ఫ్లాట్స్‌ను సైతం యస్‌ బ్యాంకు స్వాధీనం చేసుకుంది.